Tirumala Bramhostavam : అక్టోబర్ 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు(Bramhostavas) అక్టోబర్ 4వ తేదీ నుంచి మొదలు కానున్నాయి.
అక్టోబర్ 3 వ తేదీ గురువారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన జరగుతుంది. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 6.00 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఊరేగుతారు.
అక్టోబర్ 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారు చిన శేష వాహనంలో ఊరేగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం). రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి వారు హంస వాహనంలో భక్తులకు దర్శనమిస్తాడు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం) జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లికీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)లో స్వామి వారు ఊరేగుతారు. అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారు కల్ప వృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తాడు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాలవాహనంలో ఊరేగుతారు. అక్టోబర్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహనీ అవతారంలో స్వామి దర్శనమిస్తాడు. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం) ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి గజవాహనంపై ఊరేగుతారు. అక్టోబర్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్వ ప్రభ వాహనంలో స్వామి దర్శనమిస్తాడు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం) ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి వారు చంద్రప్రభవాహనంపై ఊరేగుతారు. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామి ఊరేగుతారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం ఉంటుంది.