తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ సోమ‌వారం విడుదల చేయ‌నుంది. సెప్టెంబరు నెల కోటాను ఈ రోజున‌ విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు(Srivari Arjitha Seva Tickets), దర్శన టికెట్ల(Darshan Tickets) కోటాను టీటీడీ సోమ‌వారం విడుదల చేయ‌నుంది. సెప్టెంబరు(September) నెల కోటాను ఈ రోజున‌ విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం(Suprabatham), తోమాల(Thomala), అర్చన(Archana), అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్(Online Lucky Dip) కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం(Kalyanothsavam), ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjitha Bramohsthavam), ఊంజల్ సేవ(Unjal Seva), సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల చేయ‌నుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

Updated On 18 Jun 2023 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story