Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Venkateshwara Swamy)ని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. దివ్యదర్శనానికి 3 గంటలు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,244 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,054 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం […]
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి(Venkateshwara Swamy)ని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. దివ్యదర్శనానికి 3 గంటలు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,244 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,054 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చిందని వివరించారు.
తిరుమలలో గతవారం భక్తుల రద్దీ భారీగా వుంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమల(Tirumala) కు వచ్చిన భక్తులతో పోటెత్తింది. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.