తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్‌ బాటిళ్ల(Plastic Bottles)ను నిషేధించిన టీటీడీ(TTD) వాటి స్థానంలో రాగి, స్టీల్‌ వాటర్‌(Copper, Steel Water Bottles) బాటిల్స్‌ అందుబాటులోకి తెచ్చింది. . శ్రీ పద్మావతి విచారణ కేంద్రంలో కాపర్‌, స్టీల్‌ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాగి వాటర్‌ బాటిల్‌ను రూ.450కి విక్రయిస్తున్నారు. స్టీల్ వాటర్‌ బాటిల్‌ను రెండొందల రూపాయలకు అమ్ముతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్‌ బాటిళ్ల(Plastic Bottles)ను నిషేధించిన టీటీడీ(TTD) వాటి స్థానంలో రాగి, స్టీల్‌ వాటర్‌(Copper, Steel Water Bottles) బాటిల్స్‌ అందుబాటులోకి తెచ్చింది. . శ్రీ పద్మావతి విచారణ కేంద్రంలో కాపర్‌, స్టీల్‌ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాగి వాటర్‌ బాటిల్‌ను రూ.450కి విక్రయిస్తున్నారు. స్టీల్ వాటర్‌ బాటిల్‌ను రెండొందల రూపాయలకు అమ్ముతున్నారు. ఇది విజయవంతమైతే తిరుమల వ్యాప్తంగా విచారణ కేంద్రాలలో బాటిళ్లను విక్రయిస్తామని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు తిరుమలలో వచ్చే నెల 14 నుంచి 18 వరకు అయిదు రోజుల పాటు హనుమాన్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మే 16న ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అఖండ పారాయణం కొనసాగుతుందని చెప్పారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సమూహంగా పఠిస్తారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్‌.వి.బీ.సీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

Updated On 12 April 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story