TTD Reverse Tendering : టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు.. ఏందీ రివర్స్‌టెండరింగ్ కథ!
టీటీడీలో(TTD) రివర్స్ టెండరింగ్‌ను(Reverse tendering) రద్దు చేస్తూ పాలకపక్షం నిర్ణయం తీసుకుంది.
టీటీడీలో(TTD) రివర్స్ టెండరింగ్‌ను(Reverse tendering) రద్దు చేస్తూ పాలకపక్షం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టీటీడీ ఈవో శ్యమలారావు(shyamla Rao) ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్దతిలో టెండర్ల ప్రక్రియను కొనసాగించనున్నారు. జాతీయస్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ రివర్స్ టెండరింగ్ పద్దతిని తీసుకొచ్చారు. ఈ విధానాన్నే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చింది.
రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి..?(What Is reverse tendering)
ఒక ప్రాజెక్టుకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటి సారి పిలిచిన టెండర్లలో ఏవైనా అవకతవకలు జరిగినా లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. న్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ రివర్స్ టెండరింగ్ పద్దతిని తీసుకొచ్చారు. ఈ విధానాన్నే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. దీంతో టీటీడీలో కూడా ఈ విధానాన్ని రద్దుచేశారు.