Srivani Trust Funds : శ్రీవాణి ట్రస్ట్ ఆరోపణలపై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ
శ్రీవాణి ట్రస్ట్ ఆరోపణలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్ పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణీ ట్రస్ట్ ను పునరుద్ధరించామని పేర్కొన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేశామని.. 214 కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్ట్(Srivani Trust) ఆరోపణలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి(TTD Chairman Subbareddy) శ్వేత పత్రం(White Paper) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్ పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణీ ట్రస్ట్ ను పునరుద్ధరించామని పేర్కొన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేశామని.. 214 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో 2018 లోనే ఈ ట్రస్ట్ ప్రారంభించబడిందని వివరించారు. మా ప్రభుత్వంలో 2019 సెప్టెంబరు 23న తిరిగి పునరుద్ధరించామని.. ఈ ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణ చేపడుతున్నామని వెల్లడించారు.
కొంత మంది రాజకీయ నాయకులు ఈ ట్రస్ట్ డోనర్స్ కు రసీదు ఇవ్వడం లేదని ఆరోపించారు. టీటీడీ(TTD)లో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందేనని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా లావాదేవీ(Transactions)లు మొత్తం బ్యాంకు ద్వారా మాత్రమే చేపట్టామని తెలిపారు. 120.24 కోట్లతో వివిధ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టామని వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పాండీచ్చెరీ ఇతర రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేపట్టామని.. ఈ ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించామని వివరించారు. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నామని.. ఇందు కోసం 227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఇలాంటి అనవసర ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులు(Politicians) మానుకోవాలని సూచించారు.