తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామికి(venkateswara Swamy) అలంకరించే పూలను(Flower) అవి వాడిన తర్వాత టీటీడీ(TTD) ఏం చేస్తుందో తెలుసా. శ్రీవారి సేవల కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వాడుతుంటారు. ఈ పూలకు లక్షలు, లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే వాడిపోయిన ఆ పూలను టీటీడీ వేస్ట్ చేయడంలేదు. వాడిన పూలతో అగరబత్తీలను(Incense sticks) టీటీడీ తయారు చేస్తోంది.

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామికి(venkateswara Swamy) అలంకరించే పూలను(Flower) అవి వాడిన తర్వాత టీటీడీ(TTD) ఏం చేస్తుందో తెలుసా. శ్రీవారి సేవల కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వాడుతుంటారు. ఈ పూలకు లక్షలు, లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే వాడిపోయిన ఆ పూలను టీటీడీ వేస్ట్ చేయడంలేదు. వాడిన పూలతో అగరబత్తీలను(Incense sticks) టీటీడీ తయారు చేస్తోంది. దాదాపు ఏడు రకాల అగరబత్తీలను టీటీడీ తయారుచేస్తోంది. వీటిని భక్తులకు విక్రయిస్తూ, ఆలయాల్లో వినియోగిస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తుల నుంచి మంచి స్పదన రావడంతో ఈ అగరబత్తీల ఉత్పత్తిని పెంచారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరలో గోశాలలో ఈ అగరబత్తీలను తయారుచేయిస్తున్నారు. అభయహస్త, తందనానా, దివ్యపాద, అకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి పేరుతో ఏడు రకాల అగరబత్తీలను తయారు చేస్తున్నారు. ఇందుకుగాను బెంగళూరుకు(Bangalore) చెందిన దర్శన్‌(Darshan) అనే అంతర్జాతీయ సంస్థ సహకారాన్ని టీటీడీ తీసుకుంటోంది దాదాపు 10 యంత్రాల ద్వారా ఈ అగరబత్తీలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఉత్పత్తికి అయిన ఖర్చుకే అగరబత్తీలను భక్తులకు విక్రయిస్తున్నామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఈ అగరబత్తీలకు విశేష స్పందన వస్తుందని అధికారులు వివరించారు.

Updated On 20 Nov 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story