తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనూహ్య నిర్ణయం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూలపై(Laddu) ఆంక్షలు విధించింది. ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డు(Aadhaar card) ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూ ఇస్తామని చెప్పింది. ఆధార్‌ లేకపోతే ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లినవారు బంధు మిత్రులకు ఇవ్వడానికి లడ్డూలను తీసుకుంటారు. ఇప్పటి వరకు డబ్బులు చెల్లిస్తే ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలైనా ఇచ్చేవారు. ఇప్పడలా కాదు. ఒక భక్తుడికి నెల రోజుల తర్వాత మాత్రమే రెండోసారి లడ్డూను విక్రయిస్తారు. ఏమిటో ఈ పిచ్చి నిర్ణయమని భక్తులు అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story