తిరుమల(tirumala) శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల(Brahmotsavam)ను వైభవంగా నిర్వహించనున్నారు.

తిరుమల(tirumala) శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల(Brahmotsavam)ను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల

వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు

అక్టోబర్‌ 4, 2024

సాయంత్రం 5: 45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

అక్టోబర్‌ 5, 2024

ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

అక్టోబర్‌ 6, 2024

ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.

అక్టోబర్‌ 7, 2024

ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం.

అక్టోబర్‌ 8, 2024

ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం.

అక్టోబర్‌ 9, 2024

ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.

అక్టోబర్‌ 10, 2024

ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.

అక్టోబర్‌ 11, 2024

ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.

అక్టోబర్‌ 12, 2024

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ధ్వజావరోహణం.

ehatv

ehatv

Next Story