TTD Implements Key Decision: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
వారానికి 2సార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలు అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

వారానికి 2సార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలు అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కార్ అధికారం చేపట్టాక తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోని టీటీడీ. ఇటీవల ఇదే అంశాన్ని ప్రశ్నించిన బల్మూర్ వెంకట్ , అనిరుద్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీటీడీ తీరుపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత..ఈ క్రమంలోనే శుభవార్త చెప్పిన టీటీడీ. దీని పైన తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సూచనతో టీటీడీ ఇక తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల ఆమోదం పై నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమలలో తమ లేఖలను అనుమతించాలని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు లేఖలు ఇచ్చేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ వచ్చారు. తిరుమలలో బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్.నియామకం అయ్యాక కూడా హరీష్‌రావును కలిసిన క్రమంలో ఆయన కూడా తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సులేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు తిరుమలలో ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం హోదాలో ఉన్న వారు ఇచ్చే సిఫార్సు లేఖలను ప్రతీ వారం రెండు రోజుల పాటు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
