తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 11న బ్రేక్ దర్శనాల(Break darshan)ను రద్దు చేసిన‌ట్లు టీటీడీ(TTD) ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.

Updated On 8 July 2023 10:28 PM GMT
Yagnik

Yagnik

Next Story