Tirupati Stampede Latest Updates : టీటీడీ విఫలం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విఫలం చెందింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విఫలం చెందింది. భక్తులు ఎంత మంది వస్తారు? వచ్చే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? అన్న ప్రాథమిక విషయాలను టీటీడీ పట్టించుకోలేదు. భద్రత విషయంలో కూడా విఫలమైనదని భక్తులు చెబుతున్నారు. పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శిస్తున్నారు. గాయ పడిన వారిని సకాలంలో హాస్పిటల్స్ కు తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం మరింత విషాదం. వైద్య సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ముగ్గురు మృతి చెందారని అంటున్నారు. గాయపడిన క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తీసుకువెళితే వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారిని బంధువులు స్విమ్స్‌కు తరలించారు. ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉన్నా, ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు