TTD Shyamla Rao : అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా ఇస్తారు?
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూలో(TTD Laddu) కల్తీ జరిగిందంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూలో(TTD Laddu) కల్తీ జరిగిందంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు(Shyamla rao) రియాక్టయ్యారు. ‘శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడాను. వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే.. నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారు. నెయ్యి నాసిరకంగా ఉందని కాంట్రాక్టర్‌కు చెప్పాం. నెయ్యిలో(Ghee) నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించాను. నెయ్యి నాణ్యత నిర్ధరణకు తితిదేకు సొంత ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధరణ కోసం బయట ల్యాబ్స్‌పై(Labs) ఆధారపడాల్సిన పరిస్థితి. 319 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. మేం హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారు’ అని ఈవో శ్యామలరావు చెప్పారు. టెస్ట్‌ల తర్వాత వెంటనే నెయ్యిని వెనక్కి పంపించామన్నారు. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత లేదని గుర్తించామన్నారు. నెయ్యిలో కల్తీ జరిగినట్టు పరీక్షలో వెల్లడయ్యిందన్నారు. ఎఆర్ డెయిరీ తప్ప మిగిలిన వాళ్లు సప్లయి చేసిన నెయ్యి బాగా ఉందని ఆయన అన్నారు.