తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి(Break darshan) సంబంధించి టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి(Dharma Reddy) కీలక ప్రకటన చేశారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోడానికి రోజూ వేలాదిగా భక్తులు వస్తుంటారు. దర్శనాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చే టీటీడీ బ్రేక్‌ దర్శనంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

25 ఏళ్లలోపు వారు "గోవింద కోటి"(Govindha Koti) పదిలక్షల 116 సార్లు రాసిన భక్తులకు శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే కొండపై వసతి గదులు కల్పిస్తున్నట్లు తెలిపింది. దీంతో కొండపై భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.

అంతేకాదు తిరుమల కొండపై వసతి గతులకు(Accomodation) సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నవారికే కొండపై వసతి గదులు కల్పిస్తుంది. దీంతో భక్తుల రద్దీని దీని కొంతమేర తగ్గించవచ్చని టిటిడి భావిస్తుంది.

Updated On 26 Jan 2024 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story