TTD Electric Bus : శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ
శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సును చోరి చేశారు. చోరికి గురైన ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు రూ. 2 కోట్లుగా తెలుస్తోంది. జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలను పోలీసులు పసిగట్టారు.
శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు(TTD Electric Bus) చోరీకి గురైంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సును చోరి చేశారు. చోరికి గురైన ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు రూ. 2 కోట్లుగా తెలుస్తోంది. జీపీఎస్(GPS) ఆధారంగా బస్సు కదలికలను పోలీసులు పసిగట్టారు. తిరుపతి(Tirupathi) జిల్లా నాయుడుపేట(Naidupet) వద్ద బస్సు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. నాయుడుపేట పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో నాయుడుపేట పోలీసులు బస్సును ఆపేలోపే.. దుండగలు ఉడాయించారు. టీటీడీ రావాణా శాఖ అధికారులు తిరుమల క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 24న ఉదయం 4 గంటలకు ఈ బస్సు చోరీకి గురైనట్లు పోలీసులు(Police) తెలిపారు.