తిరుమల శ్రీవారి భక్తులకు(Tirumala devotees) టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది.

తిరుమల శ్రీవారి భక్తులకు(Tirumala devotees) టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. నవంబర్‌లో వస్త్రాల వేలానికి(Clothes auction) టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు పలు రకాల వస్తువులు టీటీడీ హుండీల్లో వేస్తుంటారు. బంగారం, వెండి, కాపర్‌, నగదు, వాచీలు, దుస్తులు, సెల్‌ఫోన్లు, కెమెరాలు, బియ్యం, ఇలా ఎన్నో రకాల వస్తువులు హుండీలో వేస్తారు. హుండీలో వేసిన దుస్తులు, బియ్యాన్ని టీటీడీ ఈ వేలం వేయాలని నిర్ణయించారు. నవంబర్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌ హుండీలో వచ్చిన దుస్తులను వేలం వేయనున్నారు. భక్తులు సమర్పించిన దుస్తుల్లో పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, చీరలు, ఆఫ్ శారీస్, క్లాత్ బిట్స్, బ్లౌజ్‌ పీస్‌లు, టర్కీ టవళ్లు, శాలువాలు, లుంగీలు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు, డ్రెస్‌ మెటీరియళ్లు, కర్టన్లు, బంగారు వాకికి పరదాలు, శ్రీవారి గొడుగులు లాంటివి వేలాది రకాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈవేలంలో పాల్గొనేందుకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంపద్రించాలి. లేదా 0877-2264429కు ఫోన్‌ చేయాలి లేదా www.tirumala.org / www.konugolu.ap.govt.in సైట్‌కు వెళ్లాలని టీటీడీ సూచించింది. అయితే ఈనెల 7 నుంచి బియ్యం వేలం వేయనున్నారు. మిక్స్‌డ్‌ బియ్యం 13,880 కిలోలు ఉంది. ఆసక్తి ఉన్నవారు తిరుపతిలో ఉన్న మార్కెటింగ్ విభాగంలో కార్యనిర్వహణాధికారి, టీటీడీ పేరుతో రూ.25 వేల ఈఎండీ, సీల్డ్‌ టెండర్‌తో సమర్పించాల్సి ఉంటుంది.అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను ప్రకటిస్తారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించాలని తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story