TTD Chairman Response To Sticks Distribution : ఊతకర్రల పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ చైర్మన్
భక్తులకు టీటీడీ(TTD) ఊత కర్రల(sticks) పంపిణీపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి(Bhumana Karunakara Reddy) స్పందించారు. భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

TTD Chairman Response To Sticks
భక్తులకు టీటీడీ(TTD) ఊత కర్రల(sticks) పంపిణీపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి(Bhumana Karunakara Reddy) స్పందించారు. భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భక్తుల భద్రతలో(Safety) భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవిలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామన్నారు. తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారు జామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది. ఈ విషయమై టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలసి చైర్మన్ గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికారులు నిర్దారించారని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
