టీటీడీ పాలక మండలి(TTD Board) ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది.

టీటీడీ పాలక మండలి(TTD Board) ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్‌గా బీఆర్‌నాయుడు(BR Naidu) ఆధ్వర్యంలో జరిగిన పూర్తి స్థాయి పాలకమండలి సమావేశం జరిగింది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్‌ను(srivani trust) రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి పథకం కొనసాగుతుందన్నారు. ఆ పథకం నిధులు ప్రధాన ట్రస్ట్‌కే వెళ్తాయని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు వెల్లడించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు.. ముంతాజ్‌ హోటల్‌కు(Mumtaj hotel) ఇచ్చిన భూమి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతామన్నారు. శ్రీనివాస సేతను గరుడ వారధిగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా మార్చిందన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులకు చోటు లేదన్నారు. అన్యమత ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లడ్డూ నాణ్యత పెంచాలని పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు 10శాతం బోనస్‌ ఇస్తామని తెలిపింది. నిత్యాన్నదానం మరింత మెరుగ్గా చేపడతామన్నారు. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్లను రద్దుచేస్తున్నట్లు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story