వర్షాలు(Rains) కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ(TTD) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా ఆచార్య రుత్విక్‌ వరణం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు.

వర్షాలు(Rains) కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ(TTD) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా ఆచార్య రుత్విక్‌ వరణం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో(Tirumala) జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ(IMD) సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. తిరుపతి నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు(sticks) ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభినట్టే, త్వరలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు చేతి కర్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated On 8 Sep 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story