వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులకు మేనమామ. తిరుమల వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం జనవరి 16వ తేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుంచి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్లి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో జనవరి 16వ తేదీన పార్వేట ఉత్సవాన్ని(Parveta Utsavam) నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తెలిపింది. ఆ రోజు ఆర్జిత సేవల్ని(Arjita Seva) రద్దు చేస్తున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుమలనంబివారికి మేల్‌చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు. శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు తిరుమలనంబి.

వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులకు మేనమామ. తిరుమల వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం జనవరి 16వ తేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుంచి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్లి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మలయప్ప స్వామి, కృష్ణస్వామి పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత స్వామి ఆల‌యానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Updated On 8 Jan 2024 7:16 AM GMT
Ehatv

Ehatv

Next Story