తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది

తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కొండపై విశాఖ శారదా పీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిశ్చయించినట్లు మండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. కొత్త మండలి తొలి సమావేశం సోమవారం కొండపై ఉన్న అన్నమయ్య భవనంలో జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని ఈవో శ్యామలరావుతో కలిసి నాయుడు ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై అపోహలు, అనుమానాలు ఉన్న క్రమంలో దాని పేరు మారుస్తామన్నారు. ట్రస్టుకు వచ్చే సొమ్ము టీటీడీ ప్రధాన ఖాతాలోనే జమయ్యేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి జరిగే బోర్డు సమావేశంలో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది.ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనుంది.AI సహకారం తీసుకోవాలని టిటిడి ప్లాన్. సిబ్బంది అవసరం లేకుండా 45 ఏఐ మానిటర్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్న టిటిడి.

ehatv

ehatv

Next Story