ఏపీ(AP) తెలంగాణా(Telangana) రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా(Krishna) జలాల వివాదం(Water Issue) మరోసారి తెరపైకి వచ్చింది. రెరండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులపై కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్.. విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా 500 మంది సాయుధ బలగాలతో డ్యామ్‍పైకి వచ్చి నీటిని విడుదల చేశారన్నది ప్రధానమైన అభియోగం.

ఏపీ(AP) తెలంగాణా(Telangana) రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా(Krishna) జలాల వివాదం(Water Issue) మరోసారి తెరపైకి వచ్చింది. రెరండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులపై కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్.. విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా 500 మంది సాయుధ బలగాలతో డ్యామ్‍పైకి వచ్చి నీటిని విడుదల చేశారన్నది ప్రధానమైన అభియోగం.

నాగార్జునసాగర్ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్(Nagarjuna Sagar Dam) దగ్గర రెండోరోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడంచల భద్రత మధ్య సాగర్ డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీసుల పహారా కాస్తున్నారు. నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు ఏపీ అదికారులు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి దిగారు. అంతేకాదు.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్దంగా కుడి కాలువ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారు. అక్రమంగా నీటిని వదలడంపై 447, 427 సెక్షన్ల కింద ఏపీ పోలీసులపై(AP Police) కేసు నమోదు చేశారు.

ఇప్పటికే దాదాపు 4వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదలైంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉంది. ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‎కు చేరే అవకాశం ఉంది. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. నీటి విడుదల విషయంలో ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. తాజాగా ఏపీ అధికారులు వ్యవహరించిన తీరును తెలంగాణ తప్పుపడుతోంది. అయితే ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది.

రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే కేంద్రం కృష్ణా, గోదావరి నదీ బోర్డులను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే శ్రీశైలం(srisailam), సాగర్‌ జలశయాల నిర్వహణ బాధ్యలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అప్పగించింది. అయితే ఈ నిర్ణయం సరిగా అమలు జరగలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహిస్తోంది. అటువైపు ఏపీ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే ఉన్నాయి. వీటన్నింటిపైనా మొదటి నుంచి ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది.

ఇటీవల కేంద్ర మంత్రివర్గం సాగర్ జలాల వివాదాన్ని పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి ట్రైబ్యునల్ 2 ద్వారా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎ల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కృష్ణా వాటర్ ట్రైబ్యునల్1 అవార్డు ఇచ్చింది. కానీ మారిన పరిస్థితుల కారణంగా ట్రైబ్యునల్ 2 ద్వారా ఏపీ, తెలంగాణల మధ్య వివాదాన్ని పరిష్కరిరించడానికి కొత్త విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకుంది.

అయితే కృష్ణా ట్రిబ్యునల్ 2కు విధివిధానాలు ఖరారు మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతతో ఉంది. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ తో సవాల్ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర జలశక్తిశాఖ కోరడంతో.. తదుపరి విచారణను జనవరి 12కు వాయిదా వేసింది.

కృష్ణజిలాలకు సంబంధించి..ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు అధికార పార్టీ వైఎస్ఆర్‎సీపీ నేతలు. ఏపీ భూభాగంలో ఉన్న కుడి కాలువపై పెత్తనం తెలంగాణకు ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ఫిర్యాదు మేరకు కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ డ్యామ్ దగ్గరకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతున్న వేళ రెండు రాష్ట్రాల మధ్య ఏం జరగబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Updated On 1 Dec 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story