YS Bhasker Reddy : వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి షాకిచ్చిన కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య(YS Vivek Murder case) కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి(YS Bhasker Reddy) తెలంగాణ హైకోర్టు(TS High Court) షాకిచ్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను(Bail Petetion) హైకోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్(Uday Kumar) పిటిషన్ ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య(YS Vivek Murder case) కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి(YS Bhasker Reddy) తెలంగాణ హైకోర్టు(TS High Court) షాకిచ్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను(Bail Petetion) హైకోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్(Uday Kumar) పిటిషన్ ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు.. ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అంతకుముందే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది.