రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లేట్ లెట్స్(Platelates) సంఖ్య ప‌డిపోవ‌డంతో రిమాండ్‌ ఖైదీ మృతిచెందాడు. వివ‌రాళ్లోకెళితే.. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ(Sathyanarayana) (19) అనే యువకుడు దోపిడీ కేసులో 6వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లేట్ లెట్స్(Platelates) సంఖ్య ప‌డిపోవ‌డంతో రిమాండ్‌ ఖైదీ మృతిచెందాడు. వివ‌రాళ్లోకెళితే.. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ(Sathyanarayana) (19) అనే యువకుడు దోపిడీ కేసులో 6వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అత‌డిని 7వ తేదీన రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. అయితే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సత్యనారాయణకు డెంగ్యూ ఫీవ‌ర్‌(Dengue Fever) రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అక్క‌డ‌ చికిత్స పొందుతూ సత్యనారాయణ బుధవారం మృతి చెందాడు.

జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడని.. ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా పడిపోవడమే అతడు చనిపోడానికి కారణమని తెలిపారు. అతడిని కాపాడడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని.. అయితే ప్లేట్ లెట్స్ సంఖ్య లక్షా 50 వేలకు పడిపోయాయని స్పష్టం చేశారు. జైలులో దోమల నివారణకు ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. ఫాగింగ్ కూడా చేశామని తెలిపారు. జైలు అధికారులు సత్యనారాయణ మృతి చెందినట్లుగా అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇదే జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated On 21 Sep 2023 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story