Trolls On RK Roja: రోజా వేసుకున్న పొట్టి ఫ్రాక్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్!
మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత రోజా(RK Roja) మీడియా ముందుకు రావడం లేదు.
మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత రోజా(RK Roja) మీడియా ముందుకు రావడం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను భయంకరంగా తిట్టేవారు. ఓడిపోయిన తర్వాత రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించారు. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కనీసం బుల్లితెరపై బీజీ అవ్వాలనుకున్నారు. ఇప్పటి వరకు ఆమెకు సానుకూల సంకేతాలు కనిపించలేదు. ఈ మధ్యలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ ట్రిప్ వేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇటలీ(italy)వెళ్లారు. కూతురు, కొడుకు, భర్తతో కలిసి ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు రోజా. అయితే రోజా అక్కడ వేసుకున్న పొట్టి ఫ్రాక్(Short Frock)పై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. తెలుగుదేశంపార్టీ(TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి(Anam Venkata Ramana Reddy)కూడా ఉండబట్టలేక ఎక్స్‌లో(Twitter)రోజా ఫోటోను షేర్ చేసి సూపర్ అక్కా అంటూ కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీకే చెందిన వారు పాత వీడియోలను తవ్వుతున్నారు. అప్పుడు వస్త్రధారణలపై రోజా చేసిన వ్యాఖ్యలను ముందుకు తెస్తున్నారు. ఆడపడచులకు అందం చీరనేనని, చీరలో మాత్రమే అమ్మాయిలు ఉండాలని అప్పుడెప్పుడో రోజా అన్నారు. మరి మీరు చీర కట్టుకోకుండా ఫ్రాక్ ఎందుకు వేసుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద రోజా ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ట్రోలర్లు బీజీ అయ్యారు. రోజాను రాజకీయంగా విమర్శించవచ్చు. ప్రత్యర్థులు ఆమె విధానాలపై స్పందించవచ్చు. కానీ వస్త్రధారణపై వెటకారాలు చేయడం మంచిది కాదంటున్నారు చాలా మంది. హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.