ప్రకాశం జిల్లా(Prakasham District) పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు లో వెనుకబడిన నల్లమల్ల అటవీ(Nallamalla Forest) ప్రాంత సమీపంలో గుడెంలలో , చెంచులు గిరిజనులు నాటు సార తయారీతో పాటు వెదురు బొంగులు ఇతర కలప కోసం అటవీ సంపదని కొల్లగొడుతున్నారు వీటిని చెక్ పెట్టేలా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టింది.

ప్రకాశం జిల్లా(Prakasham District) పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు లో వెనుకబడిన నల్లమల్ల అటవీ(Nallamalla Forest) ప్రాంత సమీపంలో గుడెంలలో , చెంచులు గిరిజనులు నాటు సార తయారీతో పాటు వెదురు బొంగులు ఇతర కలప కోసం అటవీ సంపదని కొల్లగొడుతున్నారు వీటిని చెక్ పెట్టేలా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అటవీ సంరక్షణ నాగార్జునసాగర్ రిజర్వు టైగర్ ఫారెస్ట్(Nagarjunasagar Reserve Tiger Forest) పరిధిలో గిరిజన , చెంచుగూడాలలో మహిళలకు జీవన ఉపాధి కల్పించడం ద్వారా పరివర్తన తీసుకోని వచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.

ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా గిద్దలూరు(Giddaluru) డివిజన్ అధికారి వైవీ నరసింహారావు(YP Narsimha) ఆదేశాల మేరకు ఎఫ్ ఆర్ ఓ జీవన్ కుమార్(Jeevan kumar) సూచన మేరకు ఆఫీసర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మహిళలకు యువతులకు జనపనార సంచుల తయారీ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జనపనారతో 33 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. జనపనార తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొస్తున్నారు టైగర్ కన్వర్షన్ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలతో యూనిట్ని ప్రారంభించారు 45 రోజుల్లో 150 మందికి శిక్షణ ఇచ్చారు త్వరలో మహిళలకు మట్టి గాజుల కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్ , నాగార్జునసాగర్ టైగర్ ఫారెస్ట్ జోన్ గా ప్రకటించడంతో కొంతమంది జీవనాధారం కోసం అక్రమంగా అడవిలోకి ప్రవేశించి వెదురు నరికి తెచ్చుకుంటున్నారని అడవిలోకి అక్రమంగా ప్రవేశించడం చట్టరీత్యా నేరమని వారికి జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది మే 14వ తేదీ గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు(Venkatarambabu) చేతుల మీదుగా శిక్షణ ప్రారంభించామని ఎస్సీ ఎస్టీల్లో గిరిజన్ లలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తున్నామని అడవి సంపదను కూడా కాపాడుకోవచ్చని వారు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా అండగా నిలుస్తున్నామని జనపనార ఉత్పత్తుల తయారీ వాటి మెలకువలు పూర్తి శిక్షణ అటవీశాఖా ఆధ్వర్యంలో జరిగేలా చూస్తామని పురుషులకు సైతం జీవనోపాది కల్పించేందుకు పలు రకాల యూనిట్లు కూడా ప్రారంభిస్తామని ఈ జనపనార బ్యాగుల ఉపయోగంలోకి రావడం వలన ప్లాస్టిక్ నియంత్రణ చేసి పర్యావరణాన్ని కూడా పరిరక్షించి అడవులు కూడా సంవృద్ది పెరుగుతాయని అటవీ అధికారులు తెలిపారు

Updated On 22 July 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story