Sabarimala Temple : శబరి పోటెత్తిన భక్తులు..దర్శన వేళల్లో మార్పులు
పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల ఆలయానికి(Sabarimala temple) భక్తులు పోటేత్తుతున్నారు. స్వామి వారి దర్శించుకునేందుకు స్వాములు, భక్తులు కొన్ని గంటలు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం(Travancore Temple) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని(devotees Crowd) దృష్టిలో ఉంచుకుని అయ్యప్ప దర్శన(Ayyappa Dashanam) వేళల్లో మార్పులు చేసింది. సాయంత్రం 3 గంటల నుంచే భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించాలని నిర్ణయించింది. అలాగే ఆన్లైన్ బుకింగ్స్ ను(Onle booking) కూడా నియంత్రించి..పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

పవిత్ర శబరి పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శనానికి వస్తున్న భక్తులు సుమారు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. గత శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోజుకు లక్ష మందికి పైగా స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు. దీంతో భక్తులను క్యూలైన్లలో నియంత్రించడం చాలా కష్టంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. గంటల కొద్దీ క్యూలైన్ల(Que Line) వెంట వేచి ఉండలేని భక్తులకు కొందరు బారికేడ్లు దూకి మరి స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. పరిస్థితి చేజారి పోతుందని గమనించిన ఆలయాధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్ లైన్ క్యూ బుకింగ్ ను తగ్గించడంతోపాటు, దర్శన వేళల్లోనూ మార్పులు చేశారు. ప్రస్తుతం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి నుంచి దర్శనానికి సా.3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించనున్నారు.
ఇక ఆన్లైన్ బుకింగ్స్ తగ్గించడంతో దాదాపు పది వేల మంది భక్తుల సంఖ్య తగ్గినట్లు సిబ్బంది చెబుతోంది. వరుస పెట్టి సెలవులు రావడంతో స్వాములు అధిక సంఖ్యలో దేవస్థానానికి వస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సాయంత్రానికి భక్తుల వరుస సన్నిధానం నుంచి శబరి పీఠం వరకు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వస్తున్న స్వాములను చాలా మందిని పంబా వద్దనే నిలిపివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తుల తాకిడిని నివారించేందుకు పోలీసులు అదనంగా మోహరించారు. మరోవైపు స్వాములు వచ్చిన వాహనాలు ఎరుమేలి, పంబా, నిలక్కల్, ఎలవుంకల్ ప్రాంతాల్లో బారులు తీరి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్ ఆదేశించారు.