నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుండి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని తెలిపారు.

నరసరావుపేటలో (Narasaraopet) ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ అమ్మవారికి మేళాలతో బోనాలు (Ashada Bonalu) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుండి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని తెలిపారు. బిక్షాటన చేసి జీవనం సాగిస్తున్న తమకి దానం చేసిన ప్రతిఒక్కరు పిల్లా పాపలతో చల్లగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటామన్నారు. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో కూడా ఇలాంటి పూజలను నిర్వహిస్తామని మొదటి సారిగా పల్నాడు జిల్లాగా ఏర్పడిన తరుణంలో తాము పల్నాడు జిల్లాలో (Palnadu District) ఉన్నందుకు గర్వపడుతున్నామన్నారు. తమకు అన్నివిధాలుగా సహకిస్తున్న కలెక్టర్ కు, అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసారు. తమకు వైసీపీ (YCP) ప్రభుత్వం సొంత ఇళ్లను కల్పించిందని అందులో భాగంగా తమకు సహకరించిన కలెక్టర్‏కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Updated On 26 Jun 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story