మాజీ ఎంపీ రాం సహాయం సురేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సలహాలు, సూచనలు చర్చించారు. రెండు భేటీలలోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెంట వెళ్లిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల.కిరణ్ కుమార్ రెడ్డి, శివసేనరెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఫేహీం ఖురేషి, చరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
టీపీసీసీ(TPCC) అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), స్టార్ కంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Venkat Reddy) ఆధ్వర్యంలో రోజంతా చేరికలు, చేరికల సన్నహక కార్యక్రమాలు జోరుగా జరిగాయి. తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ రాం సహాయం సురేందర్ రెడ్డి(Surendhar Reddy) సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguletti srinivas) నివాసంలో కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల నివాసలకు వెళ్లిన రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎంపీ రాం సహాయం సురేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సలహాలు, సూచనలు చర్చించారు. రెండు భేటీలలోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెంట వెళ్లిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల.కిరణ్ కుమార్ రెడ్డి, శివసేనరెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఫేహీం ఖురేషి, చరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
అనంతరం ఇరువురు నేతలు మాట్లాడుతూ.. సీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే బీఆర్ఎస్‌ను గద్దె దించలగమని అన్నారు. తెలంగాణలో(telangana) 15 స్థానాలు గెలవడమే కాంగ్రెస్(congress) పార్టీ లక్ష్యమని చెప్పారు. రాహుల్ గాంధీని(rahul gandhi) ప్రధాని చేసేవరకూ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిసే పనేచేస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ రేపు సాయంత్రం విదేశీ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. రాహుల్ సమయం తీసుకుని.. మంచి కార్యక్రమాన్ని మంచి ముహుర్తంలో చేపడతామని చెప్పారు.
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్(KCR) పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. చేరికలన్నీ కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమే అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ కాలరాశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లయినా కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు.
ఏఐసీసీ(AICC) ఆదేశాల మేరకు పొంగులేటి, జూపల్లిని కలిశామని.. అలాగే పార్టీలోకి ఇద్దరినీ ఆహ్వానించినట్టు రేవంత్ తెలిపారు. రాజకీయ పునకీకరణ కోసం ఇప్పుడు పునాదులు వేసాం. పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. “తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తాం. త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమవుతాం. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం సభ ద్వారానే కేసీఆర్ ను పాతాళంలోకి తొక్కుతామని రేవంత్ అన్నారు. ఇవి ఆషామాషీ చేరికలు కాదు ఇందులో గొప్ప ఉద్దేశం ఉందని రేవంత్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే. వీళ్లే కాదు..ఇంకా చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్ లో చేరుతారన్నారు.