Revanth Reddy : కాంగ్రెస్ దూకుడు.. 26న చేవెళ్ల ప్రజా గర్జన సభ
ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) హాజరవుతారని వెల్లడించారు. ఈ బహిరంగసభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు.
ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) హాజరవుతారని వెల్లడించారు. ఈ బహిరంగసభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని సూచించారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రతీ గడపకు చేరాలి.. ప్రతీ తలుపు తట్టేలా చూడాలని.. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్ వరంగల్ లో విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) గారిని ఆహ్వానిస్తామని తెలిపారు. మేనిఫెస్టో విడుదలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరిద్దామని అన్నారు.