ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎన్నికల(Election) వేడి అమాంతం పెరిగింది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు(Nominations) వేసే పనిలో పడ్డారు. రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎన్నికల(Election) వేడి అమాంతం పెరిగింది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు(Nominations) వేసే పనిలో పడ్డారు. రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరఫున తొలిసారిగా ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneswari) నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేస్తారు. రేపు ఉదయం కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు భువనేశ్వరి. శనివారం కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. ఇవాళ భువనేశ్వరి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పంకు వెళతారు. రేపు ప్రజలతో కలిసి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేస్తారు.

Updated On 18 April 2024 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story