Tomato Price Drop : మధ్య తరగతికి చల్లటి వార్త. .. టమాటా రేటు తగ్గిందోచ్!
రెండు నెలలుగా మధ్య తరగతి టమాటాకు చాలా దూరంగా ఉంది. ఇష్టమైన ఆ టమాటాను చాలా కష్టంగా దూరం పెట్టుకున్నారు సామాన్యులు. ఎందుకంటే ఆ కూరగాయ రేటు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది కాబట్టి. కిలో టమాటా రేటు 200 రూపాయలకుపైకి వెళ్లింది. కొన్ని చోట్ల మూడొందలకు కూడా చేసింది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతుండటంతో వంటింటి బడ్జెట్ తారుమారయ్యింది
రెండు నెలలుగా మధ్య తరగతి టమాటాకు చాలా దూరంగా ఉంది. ఇష్టమైన ఆ టమాటాను చాలా కష్టంగా దూరం పెట్టుకున్నారు సామాన్యులు. ఎందుకంటే ఆ కూరగాయ రేటు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది కాబట్టి. కిలో టమాటా రేటు 200 రూపాయలకుపైకి వెళ్లింది. కొన్ని చోట్ల మూడొందలకు కూడా చేసింది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతుండటంతో వంటింటి బడ్జెట్ తారుమారయ్యింది. ఇలాంటి సమయంలో ఓ చల్లటి వార్త వినిపించింది. అది కూడా టమాటా రేటుకు సంబంధించే. నిన్నమొన్నటి వరకు టమాటా రేటు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉండింది. ఇప్పుడు దాని ధర 30 రూపాయల నుంచి 36 రూపాయలకు పడిపోయింది. టమాటా మార్కెట్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఫేమస్. అక్కడ నుంచి చాలా చోట్లకు వెళుతుంటుంది. ప్రస్తుతం ఆ మార్కెట్‌లో కిలో టమాటాను 33 రూపాయలకు అమ్ముతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో టమాటా రేట్లు లేవు. చికెన్ రేటు కంటే టమాటా రేటే అధికంగా ఉండింది. సామాన్యులు అల్లాడిపోయారు. కూరల్లో టమాటాను వాడటం మర్చిపోయారు. ఇప్పుడు టమాటా ధర తగ్గడంతో కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి టమాట దిగుబడి పెరడంతోనే ధరలు అదుపులోకి వచ్చాయని చెబుతున్నారు. పైగా డిమాండ్‌కు సరిపడా టమాటాలు మార్కెట్‌లోకి రావడంతో వాటంతకవే ధరలు ఆటోమాటిక్‌గా తగ్గాయి.