ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసుపత్రి పాలయ్యారు

ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసుపత్రి పాలయ్యారు.బండ్ల గణేష్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. అసలు బండ్ల గణేష్‌కు ఏమైందంటూ విచారణ చేస్తున్నారు.

స్వల్ప అనారోగ్యం కారణంగా బండ్ల గణేష్ అపోలో హాస్పిటల్‌ లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఇందులో బండ్ల గణేష్ బెడ్‌పై పడుకుని ఉండగా నర్సు ఆయనకి ఇంజెక్షన్ ఇస్తోంది. శ్వాసకోశ, ఇతర సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయనను చేర్పించారని తెలుస్తోంది. బండ్ల గణేష్ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించామని.. కొంత ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated On 3 Jun 2024 7:34 PM GMT
Yagnik

Yagnik

Next Story