PM Modi : నేడు అనకాపల్లికి ప్రధాని మోదీ.. అందరిలో అదే ఉత్కంఠ
ప్రధాని మోదీ నేడు అనకాపల్లికి రానున్నారు. పర్యటనలో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచార సభలో పాల్గొననున్నారు.

Today Prime Minister Modi visited Anakapalli
ప్రధాని మోదీ నేడు అనకాపల్లికి రానున్నారు. పర్యటనలో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచార సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రి నుండి అనకాపల్లిలోని రాజుపాలెంకు ప్రధాని చేరుకోనున్నారు. అక్కడ 5:40 నుండి 6:40 వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొటారు. బహిరంగ సభ అనంతరం అనకాపల్లి నుండి రోడ్డు మార్గంలో రాత్రి 7:10కి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని అహ్మదాబాద్ వెళ్ళనున్నారు. మోదీ ఉమ్మడి విశాఖ జిల్లాకు వస్తుండటంతో ఎన్నికల ప్రచార సభలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారని విశాఖ ప్రజలు భావిస్తున్నారు. విశాఖ వాసులు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ లేదనే ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చే హామీలపై కూడా ఉత్కంఠ నెలకొంది.
