నేడు సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి

నేడు సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) అనంతపురం(Ananthapuram) జిల్లా ఉరవకొండ(Uravakonda) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా(YSR Asara) నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలోని దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది మ‌హిళ‌ల‌కు ఊరటనిస్తూ.. 4 వాయిదాల్లో 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్నరూ. 25,571 కోట్ల రుణాన్ని తామే ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 3 విడతల్లో రూ. 19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు నాల్గవ విడతగా మరో రూ.6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్నిజనవరి 23 నుండి రెండు వారాల పాటు 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78, 94,169 మంది మ‌హిళ‌ల‌ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు సీఎం జ‌గ‌న్ శ్రీకారం చుట్టనున్నారు.

Updated On 22 Jan 2024 8:56 PM GMT
Yagnik

Yagnik

Next Story