AP Politics : నేడు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు ఇక్కడే
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేతలు ఎంతో బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీలో జోష్ పెంచుతూ వెళుతూ ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేతలు ఎంతో బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీలో జోష్ పెంచుతూ వెళుతూ ఉన్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రచారానికి బ్రేక్ తీసుకున్నారు. గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. పక్కాగా గెలిచే స్థానాల్లో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కీలక చర్చలు జరపాల్సిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రెండు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలోనూ, కడపలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని టీడీపీ తెలిపింది.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం చేయనున్నారు. వడ్డమాను గ్రామం నుంచి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటంతో షర్మిల ప్రచారంలో జోరు పెంచారు. గెలుపే లక్ష్యంగా ఆమె పర్యటన సాగనుంది.