Ys Jagan : ఆ బిల్డింగ్‌కి ఆ TOLET బోర్డేంటి?
వైనాట్ 175. ముప్పై ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటాం. జీవితాంతపు అధ్యక్షుడ్ని నేనే. నాకెవ్వరూ అక్కర్లేదు.

వైనాట్ 175. ముప్పై ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటాం. జీవితాంతపు అధ్యక్షుడ్ని నేనే. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు నేనే రాజూ మంత్రి అంటూ ఇటు బంధువర్గాన్ని, అటు కార్యవర్గాన్ని లెక్క లేనట్టుగా వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏంటో చెప్పడానికి ఇదొక్కటి చాలట. అంతలా అసలేం జరిగింది? ఆ బిల్డింగ్‌కి అసలు ఆ TOLET బోర్డేంటి?
తాడేపల్లి బైపాస్‌లో మెయిన్ రోడ్డుపై ఉన్న వైసీపీ ఆఫీస్ వచ్చిపోయే కార్యకర్తలతో ఎంతో కోలాహాలంగా ఉండేది. తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది. పార్టీ ఓటమి తర్వాత వాస్తు కలసి రాలేదనో లేక అద్దె కట్టడం ఎందుకనుకున్నారో ఏమో తెలీదు కానీ.. ఇక్కడి నుంచి అధినేత జగన్ అయితే పార్టీ జెండా పీకేశారట. పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఖాళీ చేయించి.. క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేశారట.
ఇక్కడి నుంచి జగన్ తన పార్టీ ఆఫీస్ తీసెయ్యడంతో ఈ భవనానికి టులెట్ బోర్డు పెట్టారు యజమాని. అంతేకాదు.. అద్దె కూడా బకాయి పడ్డట్టు సమాచారం. మరి అధికారంలో ఉన్న ఇన్నాళ్లపాటు వెనకేసింది ఏమైపోయింది? కనీసం పార్టీ ఆఫీస్ రెంటు కూడా కట్టకుంటే పరిస్థితేంటి? కార్యకర్తల్లోకి ఇదెలాంటి సందేశాన్ని తీసుకెళ్తుంది? మరీ ఇంత దివాలాకోరు తనమేంటని గుసగుసలాడుతున్నారట ఫ్యాను పార్టీ కేడర్.
151లోంచి ఐదు ఎగిరిపోయేసరికి.. ఏకంగా ఇక్కడి నుంచి పార్టీ కూడా ఎగిరిపోయిందా? ఇదెక్కడి విడ్డూరం. ఇది దేనికి సంకేతం? అయినా పార్టీ ఆఫీస్‌ను కూడా కొనసాగించలేకపోతే ఎలా? దీన్నెలా అర్థంచేసుకోవాలి? వచ్చే రోజుల్లో పార్టీకి కూడా ఇలాగే టులెట్ పెట్టేస్తారన్న అర్థం రాదా?.. హవ్వ హవ్వ అంటూ ఈ సీన్ చూసిన వెంటనే ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారట.
అధికారమున్న రోజుల్లో ముప్పై ఏళ్లు మనమే ఉంటామని బీరాలు పలికిన జగన్.. నేడు ఇలాంటి దుస్థితికి చేరుకోవడంతో ఏమనాలో అర్థం కావడం లేదట సగటు కార్యకర్తకు. ఔన్లే.. పార్టీ పేరు చూస్తే శివకుమార్ అనే ఒకరు పెట్టింది. కార్యాలయం చూస్తే అద్దెకున్నది. అంటే పార్టీ మనది కాదు. ఇక అది ఉండే భవనమూ మనది కాదు. ఇంకేముందిక్కడ.. ఏమున్నదన్నో.. అంటూ ఆర్. నారాయణమూర్తి పాట పాడుకుంటూ పొలోమని తిరిగెళ్లిపోతున్నారట కార్యకర్తలు.
