Tiruppavai Recitation : డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుప్పాపై పారాయణం
తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం(Dhanurmasam) అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై(Tiruppavai) పారాయణం చేయనున్నారు.
తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం(Dhanurmasam) అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై(Tiruppavai) పారాయణం చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి మఠంలో నెల రోజుల పాటు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్‌స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.