MLA Arani Srinivasulu : తిరుపతి కూటమిలో లుకలుకలు!
తిరుపతి(Tirupati) ఎమ్మెల్యేగా జనసేన(Janasena) నుంచి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivaslu) గెలుపొందారు.
తిరుపతి(Tirupati) ఎమ్మెల్యేగా జనసేన(Janasena) నుంచి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivaslu) గెలుపొందారు. వైసీపీ(YCP) అభ్యర్థి, భూమన కరుణాకర్‌రెడ్డి(karunakumar reddy) కుమారుడు అభినయ్‌రెడ్డిపై(Abinay reddy) దాదాపు 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు ఆరణి శ్రీనివాసులు. ఇప్పటివరకు అంతా బాగానే నడుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకరినొకరు పొగడ్తలు, ప్రశంసలు ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు(Chandrababu) జైలులో ఉన్నప్పుడు తాను షూటింగ్ ఆపేసుకొని మరీ తనకు అండగా నిలబడ్డానని పవన్ కల్యాణ్ చంద్రబాబును పొగిడితే.. పవన్ కల్యాణ్ అద్భుతంగా పని చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. పైకి అంతాబాగానే కనపడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనపడడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే తిరుపతిలో ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. తిరుపతిలో నాలుగు అన్నా క్యాంటీన్లు(Anna Canteens) ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇవ్వన్నీ టీడీపీ నేతల(TDP Leaders) కనుసన్నుల్లో ప్రారంభించారునుకుంటే పొరపాటుబడ్డట్లే. అన్నాక్యాంటీన్ల ప్రారంభానికి ముందురోజు సాయంత్రం లోకల్ టీడీపీ నేతలకు తెలిసింది. మంత్రి లోకేష్(Nara Lokesh) తిరుపతి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే, టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ నేతలంతా లోకేష్ పర్యటనలో నిమగ్నమై ఉంటే.. ఎమ్మెల్యే మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకుంటూ వెళ్లిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా, టీడీపీ నేతలు లేకుండా నాలుగు అన్నాక్యాంటీన్లను ప్రారంభించారు. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అన్నాక్యాంటీన్ల ప్రారంభోత్సవానికి తమను పిలకపోవడంతో గుస్సా మీద ఉన్నారట టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అందరినీ కలుపుకొని పోకుండా.. ఏకపక్షంగా ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని చర్చించుకుంటున్నారు. ఇదే విషయం అధిష్టానానికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా సరిగా నిండకుండానే ఇలా విభేదాలు బయటపడుతుంటే ముందుముందు ఇంకెలా పరిస్థితి ఉంటుందోనని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.