Tirupati Constable : టీడీపీ ప్రచారంలో పోలీస్ కానిస్టేబుల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Election) అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) ఎంత కీలకం, విపక్ష తెలుగుదేశంపార్టీకి(TDP) కూడా అంతే కీలకం. ఎలాగైనా సరే గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. గెలవడం కోసం జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Election) అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) ఎంత కీలకం, విపక్ష తెలుగుదేశంపార్టీకి(TDP) కూడా అంతే కీలకం. ఎలాగైనా సరే గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. గెలవడం కోసం జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రచారంలో తిరుపతి దిశా పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్(Disha police constable) రాజశేఖర్ పాల్గొనడం చాలా మందిని ఆశ్చర్యాన్ని కలిగించింది. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో దిశ కానిస్టేబుల్ రాజశేఖర్(Rajashekar) ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశంపార్టీకి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీకి ఓటు వేయాలంటూ విన్నవించుకుంటున్నారు. వాటర్ బాటిల్‌పై ముద్రించిన టీడీపీ స్టిక్కర్‌పై కానిస్టేబుల్ రాజశేఖర్ ఫోటో ఉండటం విశేషం. ఈ విషయంపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.