Tirumala Tirupati: తిరుమలకు వెళుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!!
నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో

tirumala tirupati darshan details break darshans cancelled by ttd
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉంటాయి. రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఎంతో మంది సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
