తిరుమ‌ల‌ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల(Srivari Brahmotsavam) పోస్టర్లను బుధ‌వారం టీటీడీ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ.. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

తిరుమ‌ల‌ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల(Srivari Brahmotsavam) పోస్టర్లను బుధ‌వారం టీటీడీ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ.. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) జ‌రుగుతాయ‌ని తెలిపారు. అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navrathri Brahmotsavams) జ‌రుగ‌నున్నట్లు వెల్ల‌డించారు. సెప్టెంబరు 18వ తేదిన శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తామ‌ని వెల్ల‌డించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామ‌ని.. భక్తులకు వసతులు, భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Updated On 30 Aug 2023 4:37 AM GMT
Ehatv

Ehatv

Next Story