Tirumala Special Entrance Darshan Tickets : నేడు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు టీటీడీ విడుదల చేయనుంది. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు(మంగళవారం) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Tirumala special entrance darshan tickets quota release today
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన(Tirumala Special Entrance Darshan) టికెట్ల కోటాను నేడు టీటీడీ(TTD) విడుదల చేయనుంది. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన(Special Entrance Darshan) టికెట్ల కోటాను ఈ రోజు(మంగళవారం) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్(Online)లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్(Booking) చేసుకోవాలని కోరింది. నకిలీ వెబ్సైట్ల(Fake Websites)ను నమ్మి మోసపోవద్దని సూచించింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్(TTD Mobie APP) ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని వెల్లడించింది.
