భద్రతా సిబ్బంది కళ్లు గప్పి సెల్‌ఫోన్‌తో తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో(Srivari Temple) వెళ్లడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో(Video) తీసిన కేసులో నిందితుడిని తిరుమల పోలీసులు పట్టుకున్నారు.

భద్రతా సిబ్బంది కళ్లు గప్పి సెల్‌ఫోన్‌తో తిరుమల శ్రీవారి ఆలయంలో వెళ్లడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో తీసిన కేసులో నిందితుడిని తిరుమల పోలీసులు పట్టుకున్నారు. రాహుల్‌ రెడ్డి అనే భక్తుడు ఆనంద నిలయం వీడియో చిత్రీకరణ చేశాడని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, అతడు వచ్చిన దర్శన టికెట్‌ ద్వారా ఆధార్‌ కార్డును సేకరించి అందులోని చిరునామా ద్వారా కనిపెట్టామని ధర్మారెడ్డి వివరించారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా వీడియో చిత్రికరణ చేశాడన్నారు.

రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామని, సీవీఎస్వో, వీజీవోతో పాటు భద్రతధికారులను మందలించామని ధర్మారెడ్డి తెలిపారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు.

భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీన మూడు అంచెల భద్రతను దాటి మరీ రాహుల్‌ మొబైల్‌ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన ఆ భక్తుడు శ్రీవారి ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Updated On 12 May 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story