తిరుమలలో(Tirumala) శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navratri Bramhostavam) వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి(Malayappa Swamy) సూర్యప్రభ వాహనంపై(Surya Prabha Vahanam) భక్తులను కటాక్షించారు.

తిరుమలలో(Tirumala) శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navratri Bramhostavam) వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి(Malayappa Swamy) సూర్యప్రభ వాహనంపై(Surya Prabha Vahanam) భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. అశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

Updated On 20 Oct 2023 11:47 PM GMT
Ehatv

Ehatv

Next Story