Tirumala Navaratri brahmotsavam 2023 : కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navaratri brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల(Tirumala) భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhudevi) సమేత మలయప్ప స్వామి(Mallayappa Swamy) కల్పవృక్ష వాహనంపై(Kalpa Vriksh Vahanam) కొలువుదీరారు.

Tirumala Navaratri brahmotsavam 2023
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navaratri brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల(Tirumala) భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhudevi) సమేత మలయప్ప స్వామి(Mallayappa Swamy) కల్పవృక్ష వాహనంపై(Kalpa Vriksh Vahanam) కొలువుదీరారు. తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామి వారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం..పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది.. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారమే...కోరినంత వరాలను గుప్పించే దేవుడే. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
