శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ(TTD) పలు కీలక సూచనలు(Guidelines) చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్త్తుల సంఖ్య పెరగనుండటంతో ఆలయ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ(TTD) పలు కీలక సూచనలు(Guidelines) చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్త్తుల సంఖ్య పెరగనుండటంతో ఆలయ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పది రోజులు దాదాపు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకొనే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు సూచనలను
తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

భక్తులకు టీటీడీ సూచనలు ఇవే :

* సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైంస్లాట్ టోకెన్లు తీసుకోవడం ద్వారా తిరుమల క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న తర్వాత మాత్రమే సర్వదర్శనానికి రావాలి.

* తిరుపతిలోని తొమ్మిది ప్రదేశాలలో ఏర్పాటుచేసిన 90 కౌంటర్లలో(Ticket counters) టికెట్లు ఇవ్వనున్నారు.

* ఈ కౌంటర్లలో డిసెంబరు 23, 2023 నుంచి జనవరి1, 2024 వరకు 10 రోజులకుగాను.. డిసెంబరు 22న మధ్యాహ్నం 2 గంటల నుండి 4,23,500 టోకెన్ల కోటా పూర్తయ్యేంత వరకు పైన పేర్కొన్న 92 కౌంటర్లలో నిరంతరాయంగా ఇస్తారు.

* దర్శనం టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ.. వారికి దర్శనం ఉండదు.

* టి.టి.డి. వెబ్సైట్, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను తెలుసుకున్నాకే భక్తులు తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలి.

* తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తమ టోకెన్ పై సూచించిన తేదీ, సమయానికే తిరుమలకు రావాలి.

* ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స్వయంగా వచ్చే ప్రొటోకాల్ విఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. ఈ 10 రోజులు సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

* వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. కావున వివిపీలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు వద్దు. పది రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.

Updated On 20 Dec 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story