Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి సవరించిన టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి సవరించిన టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు జరుగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహించబడతాయి.
టీఎస్ బీఐఈ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్ వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైమ్ టేబుల్ వర్తిస్తుంది. అయితే ప్రత్యేక టైమ్‌టేబుల్ జారీ చేయబడుతుంది. ఇటీవలే టీఎస్ బీఐఈ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ప్రకటించింది. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 60.01 శాతంగా నమోదు కాగా, రెండో ఏడాది 64.19 శాతంగా నమోదైంది. ముఖ్యంగా, మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలలో బాలికలు.. బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు.