TDP : శ్రీకాకుళం టీడీపీలో టిక్కెట్ల చిచ్చు
శ్రీకాకుళం టీడీపీలో టిక్కెట్ల చిచ్చు సద్దుమణిగేలా లేదు. వెలమ వర్సెస్ కాపు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన పలువురు నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు.
శ్రీకాకుళం టీడీపీలో టిక్కెట్ల చిచ్చు సద్దుమణిగేలా లేదు. వెలమ వర్సెస్ కాపు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన పలువురు నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. మూడు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులకు టికెట్లు దక్కకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమకు టికెట్లు రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడిని రాజకీయంగా దెబ్బకొట్టాలనే వ్యూహంతో మూడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు కార్యాచరణ రచించారు. ఎచ్చెర్ల నుంచి కిమిడి కళావెంకట్రావు, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే టీడీపీకి అక్కడ పెద్ద ఎదురుదెబ్బే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.