Konaseema : రావులపాలెంలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం గోదావరి నదిలో గల్లంతయ్యారు.

Three youths drown in Godavari river in Konaseema, one body still missing
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈశ్వర్‌రెడ్డి (20), సంపత్‌రెడ్డి (16), జయకుమార్ (17) నదిలో ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. రెండు మృతదేహాలు లభ్యం కాగా.. ఒక మృతదేహం ఆచూకీ లభించలేదు. వీరితో పాటు ఈతకు వెళ్లిన మరో యువకుడు రాజేష్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉండి, ప్రవాహం బలంగా ఉన్నప్పుడు నదులు, చెరువులలో ఈత కొట్టేందుకు వెళ్లే వారందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
